షర్మిలక్క ప్రజాప్రస్థానంలో శ్యామల.. సీఎం చెల్లెలిగా హ్యాపీగా వుండొచ్చు కానీ..?

బుధవారం, 27 అక్టోబరు 2021 (15:56 IST)
వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్రలో యాంకర్ శ్యామల పాల్గొన్నారు. మార్పు కోసం జరిగే యాత్రలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. వైఎస్ ఆశయాలను బాధ్యతగా తీసుకుని షర్మిల పాదయాత్ర చేయడం ఆనందంగా ఉందన్నారు. 
 
షర్మిలతో నడవడానికి తాను సిద్ధమని చెప్పారు. షర్మిలక్క ప్రజాప్రస్థానం పాదయాత్రలో ఈరోజు నేను కూడా రెండడుగులు వేయడం జరిగింది. చాలా చాలా సంతోషంగా ఉంది. మార్పు కోసం జరిగే ఈ యాత్రలో తనతోపాటు నేను కూడా ఉండడం చాలా ఆనందంగా ఉంది. 
 
8 రోజులపాటు అక్క నడుస్తున్నారని, ప్రతి ఒక్కరు తమ సమస్యలు చెబుతున్నారని, అవన్నీ ఇవాళ నేను దగ్గరుండి చూశాను. ఒక ముఖ్యమంత్రి కూతురు, మరో సీఎంకు చెల్లెలు అయిన అక్క హ్యాపీగా ఉండొచ్చు కానీ తన బాధ్యతగా భావించి వాళ్ల నాన్నగారి ఆశయాల్ని భుజంపై వేసుకుని ముందుకు నడుస్తుండడం చాలా సంతోషంగా ఉందని, ఎప్పుడూ అక్కతోపాటు నడవడానికి నేను రెడీ అని అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు