జగన్ పార్టీ నుంచి అవుట్.. షర్మిల పార్టీలోకి యాంకర్ శ్యామల?

మంగళవారం, 2 మార్చి 2021 (09:57 IST)
తెలుగు బుల్లితెర యాంకర్ శ్యామల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సుదీర్ఘ కాలంగా బుల్లితెరపై సందడి చేస్తూనే వుంది. ఈ నేపథ్యంలో యాంకర్ శ్యామల, ఆమె భర్త నరసింహా మొన్నటి ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైకాపాలో జాయిన్ అయ్యారు.
 
ఇద్దరు కూడా వైకాపాకు మద్దతుగా నిలిచారు. ఇద్దరు కూడా సోషల్‌ మీడియాలో జగన్‌‌కు అనుకూలంగా మాట్లాడారు. జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత సైలెంట్ అయ్యారు. దీంతో శ్యామల రాజకీయాలకు దూరంగా వుందంటూ ప్రచారం సాగింది. 
 
అయితే తాజాగా క్రియాశీలక రాజకీయాల విషయంలో యాంకర్‌ శ్యామల మరో అడుగు వేయబోతున్నారా అంటే అవును అనిపిస్తుంది. జగన్ సోదరి వైఎస్ షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెట్టే యోచనలో ఉన్నారు. ఇలాంటి సమయంలో షర్మిల భర్త బ్రదర్‌ అనీల్‌‌ను ఈ యాంకర్ దంపతులు కలవడం చర్చనీయాంశంగా మారింది. 
 
షర్మిల పార్టీలో చేరడం కోసమే కోసమే వీరు బ్రదర్‌ అనీల్‌‌ను కలిశారా అంటే అవును అని చాలామంది బలంగా అంటున్నారు. వైకాపాకు దూరం జరిగి షర్మిల పార్టీలో వీరు చేరే అవకాశం వుందని తెలుస్తోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు