ఇదే అదునుగా భావించిన ఆటో డ్రైవర్ను శైలజను వేధించడం మొదలుపెట్టాడు. బాధితురాలు భయంతో ఆటోలో నుంచి దూకడంతో తీవ్రంగా గాయపడింది. ఈ విషయం స్థానికులకు తెలియడంతో ఆటో వెంటపడి డ్రైవర్ను పట్టుకుని చితక్కొట్టి పోలీసులకు అప్పగించారు. గాయపడిన శైలజను సూర్యాపేట ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.