ఈ నేపథ్యంలో బిర్యానీ విషయంలో ఓ వ్యక్తి ఏకంగా తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీకి ఫోన్ చేశారు. అర్ధరాత్రి సమయంలో ఫోన్ చేసి ఎన్ని గంటల వరకు హోటల్ తెరచి ఉంచాలో చెప్పాలని అడిగాడు. దీంతో మహమూద్ అలీ స్పందిస్తూ తాను హోం మంత్రినని.. వంద టెన్షన్లలలో ఈ ఫోనేంటని అసహనం వ్యక్తం చేశారు.