ఇప్పుడు తెలంగాణాలో బిజెపి అంటే కెసిఆర్‌కు వణుకు పుడుతోందన్న ప్రచారం బాగానే సాగుతోంది. హుజురాబాద్ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ గెలుపు తరువాత టిఆర్ఎస్ నేతల్లో భయం పట్టుకుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా కెసిఆర్ అనవసరంగా స్పందిస్తూ తనకున్న విలువను తగ్గించుకునే ప్రయత్నం చేసుకుంటున్నారన్న అభిప్రాయం విశ్లేషకుల నుంచి వినబడుతోంది.
ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌గా ఈటెలను ప్రకటించి ఆ తరువాత పార్టీ కార్యకలాపాలను అప్పగించాలన్న ఆలోచనలో బిజెపి ముఖ్య నేతలు ఉన్నారట. ఈటెలను ఒక్క నియోజకవర్గానికే పరిమితం చేయకుండా తెలంగాణాలోని జిల్లాల్లో పర్యటించే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని కూడా పార్టీ నేతలు ఆదేశించనున్నట్లు తెలుస్తోంది.