ఈనెల 8వ తేదిన వికారాబాద్‌లో కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభకి సోనియా రానున్నారు. ఈ సభకి చిరంజీవి కూడా హాజరవుతారని, ప్రచారంలో పాల్గొనబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా ఇటీవలే కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి చిరంజీవిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు మరియు ఇతర అంశాలపై చర్చించారు.