పొలాలకు వెళ్లాలంటేనే భయం భయం.. చిరుత సంచారం..

బుధవారం, 23 డిశెంబరు 2020 (11:13 IST)
Leopard
తెలుగు రాష్ట్రాల్లో చిరుత పులులు, పులుల సంచారం ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. తాజాగా కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని తిప్పారం, భూర్గుల్, బొప్పుజీవాడి గ్రామాల్లో గత పదిరోజులగా చిరుత సంచారిస్తుండడంతో.. ప్రజలు భయాందోళనలకు గురౌతున్నారు. 
 
పొలాలకు వెళ్లాలంటేనే భయంతో వణికిపోతున్నారు. పంటపొలాల్లో చిరుత సంచరిస్తుండగా ప్రత్యక్షంగా చూసిన గ్రామ ప్రజలు బయటకు వెళ్లలేకపోతున్నారు. అయితే.. చిరుత సంచరిస్తుండడంతో అటవీ శాఖ అధికారులు బోనులు ఏర్పాటు చేశారు. రైతులు పొలాలకు వెళ్ళేటప్పుడు రైతులు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు