పంటినొప్పితో బాధపడుతున్న సీఎం కేసీఆర్.. నేడు ఢిల్లీకి

బుధవారం, 30 మార్చి 2022 (12:58 IST)
తెలంగాణ సీఎం కేసీఆర్ పంటినొప్పితో బాధపడుతున్నారని తెలుస్తోంది. ఇందు కోసం గాను కేసీఆర్ మరోసారి బుధవారం ఢిల్లీ వెళ్లనున్నారు. కాసేపట్లో బేగంపేట విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో ఆయన బయలు దేరనున్నారు. కాగ గత నెల క్రితం కూడా చికిత్స కోసం తన భార్యతో కలిసి ఢిల్లీ వెళ్లిన సీఎం రాష్ట్ర రాజకీయాలపై కూడా దృష్టి సారించారు.
 
అయితే బుధవారం ఢిల్లీ వెళ్లనున్న సీఎం తిరిగి ఎప్పుడు వస్తారనే సమాచారం మాత్రం లేదు. ముఖ్యంగా ధాన్యం కొనుగోలుపై కేంద్రంపై విమర్శలు గుప్పిస్తున్న సీఎం కేసీఆర్ ఇటివలే మరోసారి తన మంత్రుల బృందాన్ని ఢిల్లీకి పంపారు. దీంతో తాను సైతం ఢిల్లీకి వెళతారని ప్రచారం జరిగినా ఆయన మాత్రం వెళ్లలేదు.  

వెబ్దునియా పై చదవండి