ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి సీట్లు తగ్గుతాయని ముందుగానే తాను చెప్పానని ఆవిధంగానే ఫలితాలు వచ్చాయని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. గత ఎన్నికల్లో 312 సీట్లు గెలిచిన బీజేపీ ఈ దఫా 255 సీట్లకే పరిమితమైందన్నారు. సీట్ల తగ్గుదల దేనికి సంకేతమే కమలనాథులు ఆలోచన చేసుకోవాలని ఆయన సూచించారు.
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ధాన్యం సేకరణకు సంబంధించిన ఒకే దేశం - ఒకే ధాన్య సేకరణ విధానం ఉండాలని ఆయన డిమాండ్ చేశారు. ధాన్య సేకరణ విషయంలో గతంలో కూడా కేంద్రం తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందన్నారు. దేశంలో ధాన్యానికి మాత్రమే కనీస మద్దతు ధర ఒక్క ధాన్యానికేనని బియ్యానికి కాదనే విషయాన్ని కేంద్రం గ్రహించాలని సీఎం కేసీఆర్ హితవు పలికారు.