చలి తీవ్రత కారణంగా ఇప్పటికే అక్కడి స్కూల్ వేళల్లో మార్పులు కూడా చేశారు. ఉత్తరభారతం నుంచి మరో రెండు రోజులు చలి గాలులు వీచే అవకాశం ఉండటంతో.. ఉష్ణోగ్రతలు ఏ క్షణానైనా పడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా రెండు, మూడు డిగ్రీలు పడిపోయే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు.