ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ ఆలయం వద్ద అగ్నిప్రమాదం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఈ ఆలయ సమీపంలోని వసతి గృహాల్లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అక్కడ ఎండబెట్టిన కొబ్బరి చిప్పల నుంచి పొగ రావడం భక్తులు గమనించారు.
ఆ పొగ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకునేలోపే మంటలు చెలరేగాయి. దాంతో వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న సిబ్బంది.. స్థానికుల సాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
ప్రస్తుతం వేములవాడలో జాతర జరుగుతోంది. దాంతో జాతరకు భక్తులు వేలాదిగా హాజరయ్యారు. మంటలు చెలరేగడంతో భక్తులు, అధికారులు భయాందోళనకు గురయ్యారు. అయితే ఎవరికి ఎటువంటి హానీ జరగక పోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.