ఈ ప్రమాదం సమాచారం అందుకున్న పోలీసులు... ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులను ఫరియాద్, సునీ, లలిత, జ్యోతిలుగా గుర్తించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు కేసు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.