భాగ్యనగర వాసులకు కనువిందు.. ఆకాశంలో అందాల జాబిల్లి

శనివారం, 1 మే 2021 (17:03 IST)
full moon
కరోనాతో తెలంగాణ జనం భయాందోళనల మధ్య కాలం గడుపుతున్నారు. ఇలాంటి సమయంలో ఎండలు, వానలు కూడా అప్పుడప్పుడు పలకరించి వింత వాతావరణాన్ని తలపిస్తోంది. ఇలాంటి పరిస్థితి ఆకాశంలో అందాల జాబిల్లి ప్రజలకు కనువిందు చేసింది. 
 
సాధారణంగా ఆకాశంలో అందాల జాబిల్లి.. అంతటి అందమైన జాబిల్లిని చూస్తే మనసు హాయిగా ఉంటుంది. అంతే కాదు ఆ పున్నమి చంద్రుడిని చూసిన ప్రతి ఒక్కరి మనసు పులకించిపోతోంది. అలాంటి అందమైన జాబిల్లి.. భాగ్యనగర వాసులను ఇటీవల ఓ రాత్రి కనువిందు చేసింది. 
 
నల్లగొండ క్రాస్‌రోడ్స్ వద్ద మెట్రో పట్టాలపై మీదుగా నిండు చందమామ వెల్లివిరిసింది. ఆ అద్భుతమైన అందాల చందమామను చూపరులను కట్టిపడేసింది. ఇంకేముంది.. ఆ అందమైన జాబిల్లిని నమస్తే తెలంగాణ ఫోటో గ్రాఫర్ క్లిక్‌మనిపించాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు