రేపు హుస్సేన్‌సాగర్‌కు ఖైరతాబాద్ మహాగణపతి, 50 వేల సీసీటీవి కెమేరాలతో...
మంగళవారం, 1 సెప్టెంబరు 2020 (12:41 IST)
బుధవారం హైదరాబాదులోని హుస్సేన్ సాగర్‌లో గణపతి నిమజ్జనోత్సవ కార్యక్రమం జరుగనుంది. ఇందుకుగాను పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు తీసుకుంటున్నారు. నగరంలోని పలు కీలక ప్రాంతాల్లో సీసీటీవీ కెమేరాలు అమర్చారు.
పాత బస్తీ నుంచి వచ్చే గణేష్ విగ్రహాల తరలింపు కోసం రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. సూచించన ప్రాంతాల మీదుగా గణేష్ విగ్రహాల తరలింపు జరుగుతుందని పేర్కొన్నారు. కోవిడ్ నేపధ్యంలో భక్తులు సామాజిక దూరం పాటిస్తూ నిమజ్జన కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
కాగా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో సీసీటీవీ కెమేరాలతో కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా నిమజ్జన కార్యక్రమాన్ని పర్యవేక్షించనున్నట్లు నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నగరంలో 15 వేల మంది పోలీసులు విధుల్లో వుంటారని ఆయన తెలిపారు.