హైదరాబాద్ అబిడ్స్ ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. హైదరాబాద్‌లోని అబిడ్స్‌లో కాల్పుల కలకలం రేగింది. అబిడ్స్‌లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆవరణలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక్కడే సెక్యూరిటీ సిబ్బందిగా పని చేస్తున్న ఇద్దరి వ్యక్తుల మధ్య గొడవ జరిగినట్టు తెలుస్తోంది. దీంతో ఇద్దరు ఒకరిపై ఒకరు కాల్పులకు దిగినట్టు సమాచారం. ఈ కాల్పుల్లో ఓ ఉద్యోగికి గాయాలయ్యాయి.