తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం తారుపల్లికి చెందిన ఆర్.మౌనిక (27) అనే యువతి హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఎంటెక్-నానో టెక్నాలజీ ద్వితీయ సంవత్సరం విద్యాభ్యాసం చేస్తూ వస్తోంది. మహిళల వసతి గృహం ఎల్‌హెచ్-7లోని రూము నంబరు 24లో ఉంటోంది.
అయితే, ఘటనా స్థలం నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న నోట్‌లో.. ‘ఐయామ్ సో బ్యాడ్ డాటర్.. మిస్ యూ నాన్నా.. అమ్మ’ అని రాసింది. ఈ నెల 18నే హాస్టల్‌కు వచ్చిన మౌనిక అంతలోనే ఇక లేదన్న విషయం తెలిసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.