రోగికి అవసరమైన మందులు, ఇతర సామగ్రితో ఉన్న కిట్లను ఉచితంగా అందజేస్తున్నది. రాష్ట్రంలో దాదాపు 10 వేలకు పైగా బాధితులు హోం ఐసొలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు. వీరి ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వ వైద్యులు ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ.. టెలిమెడిసిన్ ద్వారా సూచనలు ఇస్తున్నారు.
రాష్ట్రంలో 85శాతం కేసుల్లో ఎలాంటి లక్షణాలు లేనివారే ఉన్నారు. వీరు హోం ఐసొలేషన్‌లో తీసుకోవాల్సిన మందులు ఈ కిట్‌లో ఉంటాయి. దీంతోపాటు హోం ఐసొలేషన్‌లో ఎలా ఉండాలో సూచించే బ్రోచర్, కాల్ సెంటర్ నంబర్లు, వైద్యులు, ఏఎన్‌ఎం, ఆశా వర్కర్ల మొబైల్ నంబర్లను పొందుపరిచారు.
ఐసొలేషన్ కిట్‌లో ఉండే వస్తువులు:
విటమిన్-సీ టాబ్లెట్స్ 34, జింక్ టాబ్లెట్స్ 17, బీ- కాంప్లెక్స్ 17, క్లాత్ మాస్కులు 6, శానిటైజర్ 1, హ్యాండ్ వాష్ 1, గ్లోవ్స్ 2, సోడియం హైపోక్లోరైట్ ద్రవం 1 బాటిల్