బల్దియా పోరు : చివరి అంకానికి చేరుకున్న కౌంటింగ్... గేరు మార్చిన 'కారు'

శుక్రవారం, 4 డిశెంబరు 2020 (18:58 IST)
గల్లీ నుంచి ఢిల్లీ వరకు అమితాసక్తిని నెలకొల్పిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు శుక్రవారం వెలువడుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైన ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది. అయితే, లెక్కింపు తుది దశకు చేరుకుంది. ఈ ఫలితాల్లో స్పష్టత దిశగా గ్రేటర్ తీర్పు వస్తుందన్న సూచనలు కనిపిస్తున్నాయి. 
 
ఇప్పటివరకు మొత్తం 150 డివిజన్లకుగాను తెరాస 54 స్థానాలను కైవసం చేసుకోగా, మరో 9 చోట్ల ఆధిక్యంలో ఉంది. ఇకపోతే, ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అనూహ్యంగా పుంజుకుంది. ఫలితంగా 46 చోట్ల ఆ పార్టీకి చెందిన అభ్యర్థులు గెలుపొందారు. అలాగే, పాతబస్తీలో మంచి పట్టున్న ఎంఐఎం పార్టీ 42 సీట్లను గెలుచుకుంది. కాంగ్రెస్ పార్టీ కేవలం 2 స్థానాలతోనే సరిపెట్టుకుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు