ఈ స్క్రబ్ టైఫస్ పురుగులు కుట్టడం వల్ల సోకుతుంది. ఇవి ఇళ్లలో, మంచాలు, పెరటి మొక్కల్లో, తడిగా ఉండే ప్రాంతాల్లో తిరుగుతుంటాయి. చూడటానికి ఆ పురుగులు చిన్న సైజులో నల్లిని పోలి ఉంటాయి.
అంతేకాదు ఎక్కువగా రాత్రి సమయాల్లో కనిపిస్తాయి. ఈ పురుగు కుడితే తీవ్రమైన జ్వరం, ఒళ్లు, కండరాల నొప్పులు వస్తాయి. కొందరిలో ఒంటిపై దద్దుర్లు కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే చికిత్స తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.