వారానికి ఐదు రోజులు ఉద్యోగం.. మరో రెండు రోజులు ఖాళీగా ఉంటుంది. ఈ టైమ్ ను వేస్ట్ చేసుకోకుండా.. ఈ పాండమిక్ టైమ్‌లో వికారాబాద్ జిల్లాలోని ఓ గ్రామంలో 10 ఎకరాల వ్యవసాయ భూమిని కొనేసి.. 9 ఎకరాల్లో పండ్ల మొక్కలు నాటి.. మరో ఎకరంలో ఒక షెడ్ ఏర్పాటు చేసి.. దాంట్లో కడక్ నాథ్ కోళ్ల పెంపకం చేపట్టారు. మొదట 500 కోళ్ల తో ప్రారంభించిన వీరి పెంపకం ఇప్పుడు దాదాపు ఆరు వేల కోళ్ల వరకూ పెంచుతున్నారు.
అంతే కాకుండా కోళ్ళను రోగనిరోధక శక్తిని పెంచేందుకు వేపాకు, కరివేపాకు, మునగాకును వేయడమే కాకుండా నీటిలో పసుపు, అల్లం, వెల్లుల్లి రసాన్ని కలుపుతున్నారు.