చేతబడి దహనం : మహిళ చితిపై యువకుడి సజీవదహనం

గురువారం, 19 సెప్టెంబరు 2019 (10:38 IST)
హైదాబాద్ నగరంలోని శామీర్‌పేటలో దారుణం జరిగింది. చేతబడి పేరుతో ఓ యువకుడిని సజీవ దహనం చేశారు. ఓ మహిళకు చేతబడి చేయడంతో ఆమె చనిపోయిందని భావించిన కుటుంబ సభ్యులు ఓ యువకుడిపై ప్రతీకారం తీర్చుకున్నారు. పైగా, ఆ యువకుడిని ఆ మహిళ చితిలోకి తోసి సజీవదహనం చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘోర సంఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
హైదరాబాద్ శామీర్‌పేట అద్రాస్‌పల్లిలో యువకుడు ఆంజనేయులు(24) అనే యువకుడు చేతబడి చేసి లక్ష్మీ అనే మహిళ చనిపోయింది. దీంతో ఆంజనేయులుపై పగ పెంచుకున్న మృతురాలి కుటుంబ సభ్యులు... ఘాతుకానికి తెగబడ్డారు. లక్ష్మీ చితిపైనే యువకుడిని వేసి సజీవదహనం చేశారు. దీంతో ఆ గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు