కేంద్ర ప్రభుత్వం ప్రకటించే పద్మ అవార్డులకు అర్హతగల యువత, విశిష్ట సామాజిక, స్వచ్ఛంధ సంస్థల వారు దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ డీవైఎస్‌వో పరంధామరెడ్డి సూచించారు.
జాతీయ స్థాయిలో అవార్డులు పొందుటకు ఆయా సంస్థల కార్యకలాపాల ధ్రువ పత్రాలను మూడు సెట్లను తయారు చేసుకొని ఉండాలని తెలిపారు.
పద్మ అవార్డుల గురించి పూర్తి సమాచారం పద్మ అవార్డ్స్ వెబ్‌సైట్‌లో ఉంటాయని, దరఖాస్తులను డౌన్‌లోడ్ చేసుకొని పూరించాలని తెలిపారు.
దరఖాస్తులను ఈ నెల19 లోపు నగరంలోని యువజన క్రీడల (సెట్‌కం) కార్యాలయంలో సమర్పించాలని కోరారు.