తెలుగు చిత్ర పరిశ్రమ ఎక్కడికీ తరలిపోదు : కేసీఆర్ వెల్లడి

శుక్రవారం, 1 ఆగస్టు 2014 (10:10 IST)
తెలుగు చిత్ర పరిశ్రమ ఎక్కడికీ తరలిపోదని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ.. సినీ పరిశ్రమ ఎక్కడికీ తరలిపోదన్నారు. హైదరాబాదు నగరం లాంటి వాతావరణం, నగరం దేశంలో ఇంకెక్కడా ఉండదని, అందుకే సినీ పరిశ్రమ ఎక్కడికీ తరలిపోదని అభయమిచ్చారు. 2 వేల ఎకరాల్లో సినిమా సిటీ నిర్మిస్తామని ఆయన హామీ ఇచ్చారు. 
 
అందులో అన్ని రకాల హంగులూ గ్రాఫిక్స్, యానిమేషన్, సాంకేతిక సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. తెలంగాణ కార్మికులకు, కళాకారులకు సినిమా సిటీలో ఉపాధి లభించే విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. సినిమాలు తరలిపోతాయనే ఆందోళన అనవసరమని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. 

వెబ్దునియా పై చదవండి