తెలంగాణలో సెలవు ప్రకటించిన కేసీఆర్: కలాంపై గవర్నర్ ప్రశంస

మంగళవారం, 28 జులై 2015 (10:00 IST)
భారత మాజీ రాష్ట్రపతి, శాస్త్రవేత్త ఏపీజే అబ్ధుల్ కలాం మృతికి సంతాపంగా మంగళవారం సెలవు దినంగా పాటిస్తున్నట్లు తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు అధికారికంగా ప్రకటించారు. అంతేకాక అన్ని పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
 
మరోవైపు మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాంను తాను ఎప్పటికీ గురువుగానే భావిస్తానని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తెలిపారు. కలాం మృతిపై నరసింహన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి దేశానికే కాక యావత్తు ప్రపంచానికే తీరని లోటని గవర్నర్ పేర్కొన్నారు. కలాం దేశానికి ఎనలేని సేవలు చేసిన మహోన్నత వ్యక్తి కొనియాడారు. 

వెబ్దునియా పై చదవండి