టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూస్తే జాలేస్తుందని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. రాజకీయ చదరంగంలో రైతుల్ని బలిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుటుంబానికి అధికారం నిలబెట్టుకోవడానికి రైతులను కేసీఆర్ బలి చేస్తున్నారని విమర్శించారు. కొడుకుకు అధికారం ఇచ్చేందుకు జరిగే ప్రయత్నాల్లో బీజేపీ పై విమర్శలు చేస్తున్నారని అన్నారు.