సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కోనాయిపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించి ఆ తరువాత స్వామివారి ముందు నామినేషన్ పత్రాలు పెట్టి ప్రార్థించారు. మంత్రి హరీష్ రావు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని పూజలు చేశారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్, టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.
రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీకి వంద సీట్లు దక్కేలా ఓటు వేయాలని ప్రజలను కోరారు. సిద్దిపేట నుండి హరీష్ రావు లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు సీఎం కేసీఆర్‌కు పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి చెబుతున్నా.... దేశంలోనే సంపన్న రైతులు ఎక్కడ ఉన్నారు అంటే తెలంగాణలో అనే విధంగా రైతాంగాన్ని అభివృద్ధి చేసి తీరుతానని హామీ ఇచ్చారు.