కేసీఆర్ అబద్ధాలు అడకుండా బోధించాలని కోరుతా: వి.హన్మంతరావు

శనివారం, 9 అక్టోబరు 2021 (09:30 IST)
ముఖ్యమంత్రి అబద్ధాలు విని ప్రజలు చీ చీ అంటున్నారని, చిన్నజీయర్ స్వామిని కలిసి కేసీఆర్ అబద్ధాలు అడకుండా బోధించాలని కోరుతానని మాజీ ఎంపీ వి.హన్మంతరావు తెలిపారు. కేసీఆర్ అసెంబ్లీలో పచ్చి అబద్ధాలు మాట్లాడారన్నారు.

కేసీఆర్‌ను గిన్నీస్ బుక్‌లోకి ఎక్కించాలని  వ్యాఖ్యానించారు. 2014 ఆగస్టు 15న జాతీయ జెండా ఎగురవేసిన సందర్భంగా దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారని గుర్తుచేశారు. అయితే దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని ఎప్పుడు చెప్పలేదనడం సిగ్గుచేటని మండిపడ్డారు.

హుజురాబాద్ ఉప ఎన్నిక తరువాత రూ.10 లక్షలు ఎప్పుడు ఇస్తానన్న అంటాడో ఏమో అని యెద్దేవా చేశారు. 54 శాతం బీసీలు ఉన్నారని సమగ్ర కుటుంబ సర్వే ద్వారా చెప్పారని...సమగ్ర కుటుంబ సర్వేనే ఢిల్లీకి పంపించాలని అన్నారు.

బతుకమ్మల మీద నుంచి కారు తీసుకెళ్లిన ఎమ్మెల్యే ధర్మారెడ్డిపై ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గవర్నర్‌కు ఈ విషయంపై ఫిర్యాదు చేయనున్నట్లు వీహెచ్ తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు