ముక్కోటి ఏకాదశి సందర్భంగా పలువులు కేంద్రమంత్రులు, వివిధ రాష్ట్రాల మంత్రలు ఎమ్మెల్యేలు వెంకటేశ్వరస్వామిని దర్శనం చేసుకోవడానికి క్యూ కట్టారు. అయితే ఎన్నడూ లేని విధంగా ఈసారి తిరుమలకు విఐపిల తాకిడి ఎక్కువ అయింది. ఇందులో భాగంగా స్వామిని దర్శించుకోవడాని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటిఆర్, భార్య శైలిమి, కుమార్తెతో సహా వచ్చారు.
సోమవారం వేకువజామున 12.30 గంటల నుండి 1.30 గంటల మధ్య ఆలయ ప్రవేశం చేసిన వారి వివరాలను బహిర్గతం చెయ్యాలని, సిసి టివి ఫుటేజిని మీడియాకు విడుదల చెసి భాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు భాను ప్రకాష్ రెడ్డి. శ్రీవారి ఆలయ సంప్రదాయాలను కాపాడవలసిన పూర్తి బాధ్యత ముఖ్యమంత్రి మీద ఉంటుందని, అంతేగాని నచ్చిన వారి కోసం నిబంధనలు మార్చడం మహాపాపం అన్నారు భాను ప్రకాష్ రెడ్డి. గతంలో భాను ప్రకాష్ రెడ్డి తిరుమల తిరుపతి బోర్డు మెంబరుగా పనిచేశారు.