నానక్‌రామ్‌గూడలో సిలిండర్ పేలి ఒకరు మృతి

మంగళవారం, 23 నవంబరు 2021 (17:01 IST)
నానక్‌రామ్‌గూడలో వంట గ్యాస్ సిలిండర్ పేలింది. తెల్లవారుజామున అందరూ నిద్రిస్తున్న సమయంలో ఓ అపార్ట్‌మెంట్‌లో సిలిండర్ పేలడంతో మూడంతస్తుల ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనలో ఇప్పటికే ఒకరు మరణించగా, గాయపడ్డ 11 మందిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. 
 
వివరాల్లోకి వెళితే.. నానక్‌రామ్‌గూడలోని ఓ నివాస సముదాయంలో ఈ ఘోర ఘటన చోటుచేసుకుంది. తెల్లవారుజామున 4.55 గంటలకు పేలుడు జరిగిన సమయంలో నివాస సముదాయంలో అందరూ నిద్రిస్తుండటం, బిల్డింగ్ కూలి శకలాలు మీదపడటంతో ఎక్కువ మందికి గాయాలయ్యాయి.
 
పేలుడు ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఫైర్, ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగి సహాయకచర్యలు చేపట్టారు. చికిత్స పొందుతోన్నవారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు