మొదటి భార్యకు తెలియకుండా రెండో పెళ్లి.. వ్యక్తి అరెస్ట్

గురువారం, 24 సెప్టెంబరు 2020 (09:37 IST)
తొలి భార్యకు తెలియకుండా భర్త రెండో పెళ్లి చేసుకున్నాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో భర్తను అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే..  హైదరాబాద్, నేరేడ్‌మెట్‌ కాకతీయ నగర్‌కు చెందిన బాలకృష్ణ (24) కంప్యూటర్‌ ఆపరేటర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ఇందిరానెహ్రూనగర్‌కు చెందిన సంఘం రజిత(24)తో వివాహం జరిగింది. 
 
అయినా భార్యతో తరుచూ గొడవపడుతూ ఉండేవాడు. అంతేగాకుండా.. మొదటి బార్యకు తెలియకుండా బాలకృష్ణ రెండో పెళ్లి చేసుకోవడంతో మొదటి భార్య ఫిర్యాదు మేరకు బాలకృష్ణతో పాటు ఆయన కుటుంబ సభ్యులపై కేసు నమోదుచేసిన పోలీసులు బాలకృష్ణను బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు