రోగికి సరైన వైద్యం చేయలేదనీ డాక్టరు కాళ్లు చేతులు విరగ్గొట్టారు!!

బుధవారం, 1 ఏప్రియల్ 2015 (17:22 IST)
ఆస్పత్రికి తీసుకొచ్చిన రోగికి ఆస్పత్రిలోని వైద్యుడు సరైన వైద్యం చేయలేదని ఆరోపించిన రోగి బంధువులు... సదరు డాక్టరు చేతులు, కాళ్లు విరగ్గొట్టారు. దీంతో ఆస్పత్రికి తీసుకొచ్చిన రోగి పరిస్థితి సంగతి దేవుడెరుగ కానీ.. కాళ్లు చేతులు విరగ్గొట్టిన వైద్యుని పరిస్థితి మాత్రం విషమంగా ఉంది. ఈ సంఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకోగా, తాజాగా వెలుగులోకి వచ్చింది. 
 
మెదక్ ఆస్పత్రికి ఓ రోగిని కొంతమంది బంధువులు తీసుకొచ్చారు. ఆ రోగికి ఆస్పత్రిలోని డాక్టర్ ఆశీర్వాదం వైద్యం చేశాడు. అయితే, ఆ రోగికి సరైన వైద్యం చేయలేదని ఆరోపిస్తూ.. రోగి బంధువులు ఆయనపై దాడికి దిగారు. ఈ దాడిలో డాక్టర్ కాళ్లు, చేతులు విరిగి, పరిస్థితి విషమంగా మారింది. మెరుగైన వైద్యం కోసం అతనిని హైదరాబాదు తరలించారు. డాక్టర్ ఆశీర్వాదంపై దాడికి దిగినవారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

వెబ్దునియా పై చదవండి