వరంగల్‌లో నలుగురు వలస కార్మికుల ఆత్మహత్య

గురువారం, 21 మే 2020 (20:52 IST)
వరంగల్ జిల్లాలో విషాదకర సంఘటన ఒకటి జరిగింది. నలుగురు వలస కార్మికులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. లాక్డౌన్ కారణంగా ఉపాధి లేకపోవడంతో పాటు.. పూట గడవడం కూడా కష్టమైంది. దీంతో దిక్కుతోచక వారు ఈ దారుణానికి పాల్పడ్డారు. 
 
స్థానికుల సమాచారం మేరకు... వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి చెందిన చిన్నారితో పాటు.. నలుగురు కుటుంబ సభ్యులు వరంగల్‌ జిల్లా గిర్సుకొండ మండలం, గొర్రెకుంట గ్రామంలో నివసిస్తూ కూలీనాలీ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే, లాక్డౌన్ కారణంగా వారు గత 60 రోజులుగా ఇంటికే పరిమితమయ్యారు. ఉపాధి కోల్పోవడంతో పూటగడవడం కష్టమైంది. దీనికితోడు ఆర్థిక కష్టాలు చుట్టుముట్టడంతో వారు ఆత్మహత్యకు పాల్పడ్డారు. 
 
సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు అక్కడకు చేరుకుని నాలుగు మృతదేహాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ లాక్డౌన్ కారణంగా దేశ వ్యాప్తంగా లక్షలాది మంది వలస కార్మికులు ఇదే తరహా సమస్యను ఎదుర్కొంటున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు