నిమ్స్ ఆస్పత్రికి కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నారెడ్డి తరలింపు!

మంగళవారం, 16 సెప్టెంబరు 2014 (13:51 IST)
వనపర్తిని కేంద్రంగా చేస్తూ కొత్త జిల్లాను ప్రకటించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీకి చెందిన వనపర్తి ఎమ్మెల్యే చిన్నారెడ్డి ఆమరణ దీక్షకు చేపట్టగా, ఆయనను మంగళవారం బలవంతంగా నిమ్స్‌కు తరలించారు. గత మూడు రోజులుగా ఆయన ఈ దీక్ష చేస్తూ వచ్చారు. దీంతో ఆయన పల్స్ రేట్ పోవడంతో ఆరోగ్య పరిస్థితి విషమించింది. 
 
దీంతో ఆయనను పోలీసులు నిమ్స్‌కి తరలించారు. దీక్ష విరమించాలని పార్టీ నేతలతో పాటు, పోలీసులు విజ్ఞప్తి చేసినా చిన్నారెడ్డి పట్టు వీడలేదు. దీంతో పోలీసులు ఆయనపై 309 సెక్షన్ కింద ఆత్మహత్యాయత్నం కేసు నమోదు చేశారు. చిన్నారెడ్డి నిమ్స్‌లో కూడా నిరాహారదీక్ష కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది.

వెబ్దునియా పై చదవండి