కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్కకు అస్వస్థత.. 4 కిలోమీటర్ల పాదయాత్రకు తర్వాత..?

మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (16:37 IST)
కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్కకు అస్వస్థత గురయ్యారు. ఏటూరునాగారం తహశీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చిన అనంతరం అస్వస్థత గురయ్యారు. దీంతో చికిత్స నిమిత్తం సీతక్కను ఏటూరునాగారం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 
 
దళిత గిరిజన దండోర యాత్ర సందర్భంగా స్థానిక మార్కెట్‌ నుంచి తహసీల్‌ కార్యాలయం వరకు 4 కిలోమీటర్ల మేర సీతక్క పాదయాత్ర చేశారు. అనంతరం తహసీల్దారుకు వినతి పత్రం సమర్పించిన తర్వాత కార్యాలయం బయట కూర్చున్న సీతక్క ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోయారు. శరీరమంతా చెమటలు పట్టాయి. అక్కడే ఉన్న కార్యకర్తలు ఆమెను వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
 
ప్రస్తుతం సీతక్క అక్కడే చికిత్స పొందుతున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సీతక్క అస్వస్థతకు గురవడంతో కార్యకర్తలు ఆందోళనకు గురయ్యారు. సమయానికి ఆస్పత్రిలో సూపరింటెండెంట్ లేకపోవడంపై కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు