దేశంలో మంకీపాక్స్.. అలెర్ట్ అయిన తెలంగాణ

శనివారం, 16 జులై 2022 (13:23 IST)
దేశంలో మంకీపాక్స్ కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. 
 
సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో శనివారం(ఈరోజు ) నుంచి మంకీపాక్స్ టెస్టులు చేయనున్నట్లు సమాచారం. అందుకు సంబంధించిన ల్యాబ్‌లను ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు వైద్యాధికారులు తెలిపారు.
 
ఇక్కడ సేకరించిన శాంపిల్స్‌ను పుణె ల్యాబ్‌కు పంపనున్నట్లు సమాచారం. కాగా ఇప్పటికే మంకీపాక్స్ 50 దేశాలకు విస్తరించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు