ఇనుప కంచెపై కరెంట్ తీగలు.. పట్టుకున్న తల్లి మృతి.. రక్షించబోయిన కూతురు కూడా?

బుధవారం, 7 జూన్ 2017 (17:08 IST)
కరెంట్ తీగలు తగిలి తల్లీకూతురు దుర్మరణం పాలైన ఘటన తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్ జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. బుధవారం తెల్లవారుజామున జిల్లాలోని నారాయణపేట మండలం జాజపూర్‌లో కరెంట్ తీగలు తల్లీకుమార్తెలను బలితీసుకున్నాయి. ఇంటికి రక్షణగా వుంటాయని ప్రహరీగా వీరు ఇనుప కంచెను నిర్మించుకున్నారు. కానీ గాలికి విద్యుత్ తీగలు తెగి ఈ కంచెపై పడ్డాయి.
 
ఆపై ఇనుప కంచెకు విద్యుత్ సరఫరా అయింది. ఇది తెలుసుకోని మహిళ పని చేసుకుంటూ కంచెను ముట్టుకుని విద్యుద్ఘాతానికి గురైంది. దీన్ని గమనించిన ఆమె కూతురు తల్లిని రక్షించబోయి కరెంట్ షాక్‌కు గురైంది. ఈ ఘటనలో ఇద్దరూ మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి