తెలంగాణాలోని మొత్తం 118 మునిసిపాలిటీలకు, 10 కార్పొరేషన్ లకు ఎన్నికలను నిర్వహిస్తున్నారు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ప్రకటించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి షెడ్యూల్ ప్రకారం యథాతథంగా మున్సిపల్ ఎన్నికల నిర్వహిస్తామని తెలిపారు.
118 మునిసిపాలిటీలు, 10 కార్పొరేషన్లకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైందని, షెడ్యూల్ ప్రకారమే మునిసిపల్ ఎన్నికలు జరగనున్నాయన్నారు. జనవరి 8 నుంచి 10 వరకు నామినేషన్ల స్వీకరణ, జనవరి 11న నామినేషన్ల పరిశీలన చేయనున్నారు. జనవరి 14 నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరు తేదీ అన్నారు. జనవరి 22న పోలింగ్, 25న ఫలితాలు విడుదలవుతాయని తెలిపారు.