ఈ ఉప ఎన్నికకు సంబంధించిన 7వ తేదీన అధికారికంగా నోటిఫికేషన్ జారీచేస్తారు. అదే రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. 14వ తేదీతో నామినేషన్ల స్వీకరణ గడువు ముగుస్తుంది. 15వ తేదీన నామినేషన్లు పరిశీలిస్తే, 17వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. నవంబరు 3వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు. ఆరో తేదీన ఓట్ల లెక్కింపు చేపడుతారు.
కాగా, కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. కాగా, ఈ మాజీ ఎమ్మెల్యే ఈ దఫా బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. అలాగే, తెరాస, కాంగ్రెస్ పార్టీలు కూడా బలమైన అభ్యర్థులను బరిలోకి దించుతున్నాయి.