ఆదిలాబాద్‌లో వింత - పాలు తాగుతున్న నందీశ్వరుడు

ఆదివారం, 6 మార్చి 2022 (14:18 IST)
తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలో ఓ వింత చోటుచేసుకుంది. నందీశ్వరుడు పాలు తాగుతున్నాడు. ఈ వింతను కళ్లారా చూసేందుకు స్థానికులతో పాటు చుట్టుపక్కల గ్రామాల వాసులు ఈ ఆలయానికి క్యూకట్టారు. 
 
ఆదిలాబాద్ జిల్లా క్రాంతినగర్‌లోని శివాలయంలో ఈ వింత ఘటన జరిగింది. ఈ ఆలయం గాండ్ల గ్రామంలో ఉంది. ఈ ఆలయంలో ఉన్న నందికి పాలు పోయగా పూర్తిగా తాగేసింది. అదీకూడా మహాశివరాత్రి మహోత్సవం తర్వాతం ఇలాంటిది జరగడంతో ఇదంతా ఆ పరమశివుడి మహత్మ్యమని భక్తులు నమ్ముతున్నారు. 
 
గతంలో వినాయకుడు పాలుతాగడం, సాయిబాబా విభూతి రాల్చడం, శ్రీరాముడు కన్నీళ్లు పెట్టుకోవడం వంటి సంఘటనలు గతంలో తెలుగు రాష్ట్రాల్లో చూశాం. ఇపుడు నందీశ్వరుడు పాలు తాగడం గమనార్హం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు