ఇక తెలంగాణలో 'నో లాక్ డౌన్'?

మంగళవారం, 15 జూన్ 2021 (08:46 IST)
తెలంగాణలో జూన్ 19 తరువాత లాక్‌డౌన్  ఉండదని ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాస రావు సూచన ప్రాయంగా తెలిపారు. కేసులు అదుపులోకి వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ దిశగా నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉందని చెప్పారు. లాక్ డౌన్ ముగిసిన తరువాత కూడా తప్పనిసరిగా కొవిడ్ జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

రాష్ట్రంలో ప్రస్తుతం 1.36 పాజిటీవిటి రేటు ఉందని, ఆసుపత్రిలో బెడ్ ఆక్యూపెన్సీ తగ్గిందని వివరిచారు. 170 ప్రైవేట్ ఆసుపత్రులపై ఇప్పటివరకు మొత్తం 350 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు, కోర్టు సూచనల ప్రకారం విచారణలు చేపట్టి బాధితులకు రిఫండ్ చేయించే అంశాలపై చర్యలు చేపడుతామన్నారు.

వర్షాకాలంలో ప్రతి ఏటా ప్రబలే సీజనల్ వ్యాధులపై ప్రభుత్వం దృష్టిసారిస్తుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో మలేరియాలో 0.5 ఫెలోషిప్ స్థాయిలో ఉందని వీటిని పూర్తిగా నిర్మూలించేందుకు తగిన కార్యచరణను ప్రారంభించామన్నారు.
 
వర్షకాలం సోకే మలేరియాతో పాటు డెంగ్యూ, చికెన్ గున్యా, టైఫాయిడ్, డయేరియా, ఇన్ ఫ్లూఎన్‌జా, నిమోనియా, సీజనల్ జ్వరం వంటి వ్యాధులు సోకకుండా ముందుస్తు జాగ్రత్తలు చేపడుతున్నామని ప్రకటించారు. వీధుల్లో ఫాగింగ్ చేపట్టడం, బ్లీచింగ్ పౌడర్ చల్లడం, డ్రైడే ఫ్రైడే వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.

థర్డ్ వేవ్ తీవ్రంగా వస్తుందన్న అసత్య ప్రచారాలను నమ్మెద్దని తెలియజేశారు, థర్డ్ వేవ్ వచ్చినా కానీ ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. థర్డ్ వేవ్ పై ఓ టీవి చానల్‌లో భయాందోళనకు కల్గించే వ్యాఖ్యలు చేసిన డాక్టర్ పరుచూరి మాలిక్ పై క్రిమినల్ కేసులు నమోదు చేశామని తెలిపారు. ఎలాంటి సైంటిఫిక్ ఆధారాలు లేకుండా అవగాహనలు లేకుండా ప్రజలను భయపెట్టేలా చర్చించడం ఎపిడమిక్ యాక్ట్ ప్రకారం నేరమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇలాంటి అసత్య ప్రచారాలు ఎవరు చేసినా కానీ కఠిన చర్యలు చేపడుతామన్నారు. కొవిడ్ సోకిందని భయానికే చనిపోయిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారని డీఎంఈ రమేష్ రెడ్డి అన్నారు. ప్రజలను భయపెట్టే ప్రసంగాలు ఎవరూ చేసిన తగిన చర్యలు చేపడుతామన్నారు. థర్డ్ వేవ్‌లో సీరియస్ నెస్ ఎక్కువగా ఉంటుందని, చిన్న పిల్లల్లో ఎక్కువగా సోకుతుందన్న వార్తలు పూర్తిగా అవాస్తవమన్నారు.

థర్డ్ వేవ్‌లో పిల్లలకు వ్యాధి సోకినా కానీ తగిన చికిత్సలందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కేవలం పిల్లలకు చికిత్సలందించేందుకే 6000 బెడ్లను ఏర్పటు చేశామని చెప్పారు. నిలోఫోర్ ఆసుపత్రిలోనే 2000 బెడ్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు