తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణా ఎంసెట్‌లో ఇంటర్ మార్కుల వెయిటేజీ ఎత్తివేసింది. దీంతో ఇకపై ఎంసెట్ మార్కులతోనే ర్యాంకులను కేటాయించనుంది. ఎంసెట్ ర్యాంకుల కేటాయింపులో ఇంటర్ మార్కుల ఆధారంగా 25 శాతం వెయిటేజీని ఇస్తూ వచ్చారు. ఇపుడు దీన్ని తొలగిస్తూ ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రద్దు వెనుక అనేక కారణాలతో నిర్ణయం తీసుకున్నట్టు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది.
కాగా, జేఈఈ మెయిన్, నీట్‌సోనూ ఇంటర్ మార్కుల వెయిటేజీని తొలగించిన విషయం తెల్సిందే. ఎంసెట్‌కు పలు బోర్డుల నుంచి విద్యార్థులు హాజరవుతున్నారు. అయితే, ఆయా బోర్డులు సకాలంలో ఫలితాలను విడుదల చేయడం లేదు. ఒక వేళ విడుదల చేసినా ఎంసెట్ అధికారులకు ఆయా బోర్డులో అందజేయడం లేదు.