నర్సింగ్ విద్యార్థినికి మాయమాటలు చెప్పాడు.. నెలరోజులు అనుభవించి ఆ తరువాత

గురువారం, 10 అక్టోబరు 2019 (22:45 IST)
అది హైదరాబాద్ లోని నాగోల్ ఏరియా... మెదక్ పట్టణానికి చెందిన సౌమ్య నర్సింగ్ ఫైనలియర్ చదువుతోంది. విద్యాభ్యాసం కోసం హైదరాబాద్ లోని నాగోల్ ఏరియాకు వచ్చి అక్కడే గదిని అద్దెకు తీసుకుని ఉండేది. సౌమ్య తండ్రి మెదక్‌లో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు. ఒక్కటే కూతురు. ఎంతో గారాబంగా పెంచారు.
 
సౌమ్య గదిలో ఒక్కటే ఉండేది. చదువులో ఎప్పుడూ ఫస్టే. సౌమ్య ఒక్కటే ఉండడాన్ని గమనించాడు నవీన్ అనే యువకుడు. అతను ఆమె గది పక్కనే ఉండేవాడు. ఇంటర్ పూర్తి చేసి ఐదేళ్ళుగా ఇంట్లో ఖాళీగా తిరుగుతుండేవాడు. ఆమెకు ఎలాగైనా దగ్గరవ్వాలని భావించాడు. వారంరోజుల పాటు ఆమె వెంట తిరిగాడు. ఆమెను ఫ్రెండ్‌గా చేసుకున్నాడు.
 
అయితే ఆ తరువాత వీరి స్నేహం కాస్త ప్రేమగా మారి హద్దులు కూడా దాటేశారు. ఇలా నెలరోజుల పాటు వీరి మధ్య ఆ సంబంధం కొనసాగింది. సౌమ్య నవీన్‌తో క్లోజ్‌గా ఉండడం తండ్రికి తెలిసిపోయింది. ఆమెను మందలించాడు. తాను చేస్తున్న తప్పును సౌమ్య గ్రహించింది. చదువుపై ప్రత్యేక శ్రద్థ పెట్టింది. నవీన్‌ను దూరం పెట్టింది. తనను గాఢంగా ప్రేమిస్తూ.. తనకు దగ్గరైన సౌమ్య తనను ఉన్నట్లుండి దూరం పెట్టడాన్ని జీర్ణించుకోలేపోయాడు నవీన్.
 
ఫుల్లుగా మద్యం సేవించి ఆమె గదికి వెళ్ళాడు. సౌమ్యతో గొడవ పెట్టుకున్నాడు. ఆమె చున్నీతోనే ఊపిరాడకుండా గొంతు నులిమి చంపేశాడు. అయితే తన పేరు బయటకు రాకుండా ఉండాలనే ఉద్దేశంతో సౌమ్య రాసుకునే డైరీలో ఒకేరోజు చిన్న కట్టు కథను అల్లాడు. నవీన్ నాకు మంచి స్నేహితుడు. నాకు శత్రువులు చాలామంది ఉన్నారని సౌమ్య రాసినట్లు డైరీలో రాశారు. మొదట్లో నవీన్ పైన పోలీసులకు కూడా అనుమానం రాలేదు. కానీ లోతుగా విచారణ జరిపిన తరువాత నవీన్ అసలు హంతకుడని నిర్థారించుకుని అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు