తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ - శోభ దంపతుల పంచలోహ చిత్రాలతో ఓ చిత్రపటాన్ని ప్రత్యేకంగా రూపొందించారు. దీన్ని రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ తయారు చేయించారు. ఈ పంచలోహ చిత్రపటాన్ని తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్‌కు అందేశారు. ఇటీవల కేటీఆర్ పుట్టిన రోజు వేడుక జరిగింది. ఆ రోజన ఈ పటాన్ని అందజేశారు.
ఇద్దరు ప్రముఖ శిల్పులు 3 నెలల పాటు శ్రమించి దీనిని తయారు చేశారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. కేటీఆర్ పుట్టినరోజు నాడు మహబూబ్‌నగర్‌లో ముక్కోటి వృక్షార్చన, రక్తదానం, దివ్యాంగులకు త్రిచక్ర మోటారు వాహనాలను పంపిణీ చేశామన్నారు.