సిద్దిపేట జిల్లా మునిగడప నుంచి బాధిత కుటుంబం యాదాద్రి జిల్లాకు వలసొచ్చింది. ఫౌల్ట్రీఫామ్‌లో కూలీలుగా పనికి కుదిరారు. ఊరి వారితో కలిసిమెలిసి ఉంటున్న ఈ కుటుంబ సభ్యులు ఇలా శవాలుగా కనిపించడంతో గ్రామంలో విషాదం నెలకొంది. అప్పుల బాధతోనే ఇంటి పెద్ద ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చనే వాదనా వినిపిస్తోంది.