మర్దనా కేంద్రాలు వ్యభిచార కేంద్రాలుగా కూడా అక్కడక్కడా కనిపించడం మామూలైంది. ఎంతో నిఘా వేస్తే తప్పించి ఇటువంటి వాటిని గుర్తించలేరు. బుధవారం నాడు హైదరాబాదులోని వనస్థలిపురం పోలీసు స్టేషను పరిధిలో ఓ మసాజ్ కేంద్రంలో గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న వ్యభిచారం నిర్వహిస్తున్న వారిని రెడ్ హ్యాండెడ్‌గా పోలీసులు పట్టుకున్నారు.