సూర్యాపేట వైద్య కాలేజీలో ర్యాగింగ్ కలకలం

సోమవారం, 3 జనవరి 2022 (16:05 IST)
తెలంగాణా రాష్ట్రంలోని సూర్యాపేట వైద్య కాలేజీలో ర్యాగింగ్ కలకల చెలరేగింది. ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి పట్ల కొందరు సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేశారు. ఈ అమానుష ఘటన శనివారం అర్థరాత్రి జరిగింది. 
 
బాధిత విద్యార్థి శరీరంపై ఉన్న దుస్తులను బలవంతంగా తొలగించి ఫోటోలు తీశారు. ఆ తర్వాత జుట్టుకూడ కత్తిరించినట్టు సమాచారం. ఈ ఘటనతో భయాందోళనకు గురైన బాధిత విద్యార్థి హైదరాబాద్ నగరంలోని తల్లిదండ్రులకు ఫోను చేసి బోరున విలపిస్తూ సమాచారం చేరవేసింది. 
 
ఆ తర్వాత 100కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు రంగంలోకి దిగి విద్యార్థిని రక్షించారు. ఈ ఘటనపై 25 మంది సీనియర్ విద్యార్తులపై కేసు నమోదు చేశారు. మరోవైపు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి హరీష్ రావు సీరియస్ అయ్యారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు