రాష్ట్రంలో టీఆర్టీ, గ్రూప్-2 ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు తీపికబురు అందించేందుకు టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తోంది. ఈ నెలాఖరుకల్లా ఫలితాలు వెల్లడించాలని లక్ష్యంగా పెట్టుకుంది. టీఆర్టీ ఎస్జీటీ తెలుగు మాధ్యమం ఫలితాలను ప్రకటించేందుకు ప్రక్రియ పూర్తిచేసింది. జాబితాను పునఃపరిశీలించి సోమవారం నాటికి ఫలితాలు ప్రకటించాలని భావిస్తోంది.
తొలుత గ్రూప్-2 ఫలితాలను ఇచ్చేందుకు కసరత్తు మొదలుపెట్టింది. అదే సమయంలో టీఆర్టీపై మరోసారి రీలింక్వీష్మెంట్ తీసుకోవాలంటూ హైకోర్టు ఆదేశిలిచ్చింది. ఈ నేపథ్యంలో గ్రూప్-2 ఎంపిక ప్రక్రియను టీఎస్పీఎస్సీ వాయిదా వేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు సెప్టెంబరు16 వరకు టీఆర్టీ అభ్యర్థుల నుంచి రీలింక్వీష్మెంట్ను తీసుకుంది.