ఆర్ధికంగా వెనుకబడిన, పేదల సౌకర్యం గురించి ఆలోచించిన ప్రభుత్వం ఈ తరహా సదుపాయం కోసం హరే కృష్ణ మూవ్‌మెంట్ స్వచ్చంద సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. పది రోజుల్లో ఈ ఐదు రూపాయల భోజనం సదుపాయం అందుబాటులోకి రానుంది.
ఇందులో భాగంగా తొలివిడతగా జీహెచ్‌ఎంసీ పరిధిలోని 18 ప్రధాన ఆసుపత్రుల దగ్గర ఈసౌకర్యం అందుబాటులోకి తెస్తోంది. రోజుకు 55,800 భోజనాలను రోగుల సహాయకులకు అందించేందుకు అంతా సిద్ధం చేసింది . దీని ద్వారా రోజుకు 18,600మందికి లబ్ది చేకూరనుంది.