గణేష్‌ నిమజ్జనం.. 400 మందిపై కేసు.. రంగంలోకి షీ టీమ్స్

శనివారం, 30 సెప్టెంబరు 2023 (15:41 IST)
గణేష్‌ నిమజ్జనం సందర్భంగా పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. మహిళల పట్ల అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు తగిన చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా 400 మంది పోకిరీలను అరెస్ట్ చేశారు. 
 
దీనిపై సీపీ సీవీ ఆనంద్‌ మాట్లాడుతూ.. గణేష్‌ ఉత్సవాల్లో మహిళలతో అనుచితంగా ప్రవర్తించిన 400 మందిపై కేసులు నమోదు చేసామన్నారు. 
 
ఈసారి అనుకున్న సమయం కంటే ముందుగానే ఖైరతాబాద్‌ వినాయకుడి నిమజ్జనం పూర్తయింది. జియో ట్యాగింగ్‌ లెక్కల ప్రకారం ఇప్పటివరకు 10 వేల విగ్రహాల నిమజ్జనం జరిగింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు