ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ… టీఆర్ఎస్‌కు షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే వరుస చేరికలతో జోష్‌లో ఉన్న కాంగ్రేస్ శ్రేణలకు, మరింత బూస్టునిస్తూ… పెద్దనేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారు. ఆ నేతలంతా ఇప్పటికే డిల్లీ చేరుకోగా, శనివారం ఉదయం రాహుల్ సమక్షంలో వీరు పార్టీలో చేరబోతున్నారు.
టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు డీ శ్రీనివాస్ కూడా రాహుల్ సమక్షంలో పార్టీలో చేరేందుకు మార్గం సుగుమం అయింది. ఇప్పటికే ఆయన అధిష్టాన పెద్దలతో టచ్‌లో ఉన్న డీఎస్, పార్టీలోకి వస్తే… తప్పకుండా ఆదరిస్తామని హమీ ఇచ్చినట్లు సమాచారం.
గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి కూడా కూడా సొంతగూటికి చేరబోతున్నారు. ఇప్పటికే ఆయన డిల్లీ చేరుకున్నారు. గజ్వేల్ నుండి టీఆర్ఎస్ ద్వితీయ శ్రేణి నాయకత్వం కూడా కాంగ్రెస్‌కు వెళ్లబోతోంది. ఇక, 2014 టీడీపీ-బీజేపి కూటమి సీఎం అబ్యర్థి, బీసీ నేత, ఎల్.బి.నగర్ తాజామాజీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య కూడా కాంగ్రెస్ గూటికి చేరేందుకు మొగ్గుచూపుతున్నారు.
రంగారెడ్డి జిల్లాల్లో ఏదో ఒక నియోజకవర్గం నుండి కూటమి అబ్యర్థిగా కృష్ణయ్య పోటీచేయబోతున్నారు. నర్సారెడ్డి ఇప్పటికే డిల్లీ చేరుకోగా, డీఎస్, ఆర్ కృష్ణయ్యలు శుక్రవారం సాయంత్రం డిల్లీ వెళ్లబోతున్నారు. ఇక కరీంనగర్ టీఆర్ఎస్ కీలక నేత, మహిళా నాయకురాలు… జెడ్పీ చైర్మన్ తుల ఉమ కూడా రాహుల్ సమక్షంలో పార్టీలో చేరబోతున్నట్లు కాంగ్రస్ వర్గాలు సమాచారం అందిస్తున్నాయి. వీరంతా శనివారం ఉదయం 9 గంటలకు కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు.